నచ్చిన పాటల సాహిత్యం

01. నిను చూడక నేనుండలేను


చిత్రం : నీరాజనం
స్వరకల్పన : ఓ.పి. నయ్యర్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : యస్. పి. బాల సుబ్రమణ్యం , యస్. జానకి



నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలానే...


ఏ హరివిల్లు విరబూసినా.. నీ దరహాస మనుకుంటినీ..
ఏ చిరుగాలి కదలాడినా.. నీ చరణాల శృతి వింటినీ...
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో..


నీ జత గూడి నడయాడగా.. జగమూగింది సెలయేరుగా..
ఒక క్షణమైన నిను వీడినా.. మది తొణకింది కన్నీరుగా..
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం.!




02. ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూఉన్నా


చిత్రం : నచ్చావులె
రచన : భాస్కరబట్ల
స్వరకల్పన : శేఖర్ చంద్ర
గానం : దీపు



ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూఉన్నా
నీకోస౦ ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాస౦త౦ అవుతో౦దే నా సొ౦త౦
ఎద ని౦డా ఆన౦ద౦ నన్నే నన్నే ము౦చేస్తొ౦దే
oh..my love..oh..my love...oh..my love mylove..oh o...


వస్తావో రావో అ౦టూ స౦దేహ౦లో నేనున్నానే
కనిపి౦చి మురిపి౦చాకా క౦గారవుతున్నానే
నీ అ౦ద౦ పూలచెట్టు కాదా నీ పెదవే తేనె బొట్టు కాదా
నీ వయసే మాగ్నెట్టు లాగా నన్నే లాగుతో౦దే
నవ్వుల్లో స౦ధ్యారాగ౦ ఈ రోజే వి౦టున్నా
ఎ౦డల్లో శీతాకాల౦ నీ వల్లేగా అనుకు౦టున్నా
oh..my love..oh..my love...oh..my love mylove..oh o.. ||ఏవేవో||


ఈ రోజే ఆకాశ౦లో హరివిల్లేదో కనిపి౦చి౦ది
తెలతెల్లని మబ్బుల్లోనా ఎ౦తో ముద్దొస్తొ౦దే
ఆ చూపే టార్చ్ లైట్ కాదా ఆ రూప౦ చాక్లెట్ కాదా
తన చుట్టూ శాటిలైట్టు లాగా మనసు తిరుగుతో౦దే
జాబిల్లే నేలకు వచ్చి నాము౦దే నిలిచి౦దా
అదృష్టం నన్నే మెచ్చి నిన్నే నాకు అ౦ది౦చి౦దా
oh..my love..oh..my love...oh..my love mylove..




03. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా

చిత్రం : నచ్చావులె
రచన : భాస్కరబట్ల
స్వరకల్పన : శేఖర్ చంద్ర
గానం : గీతామాధురి



నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావే.. ఓ
నచ్చావే.. నచ్చావులే..


అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరే పనేంలేదా నీకు నన్నే వదలవూ..
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుందీ సీతాకోకలాగా


నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నదీ..ఓ.
మనసునేమో దాచమంటే అస్సలేమో దాచుకోదూ
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదూ
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా


నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావులే.. ఓ.
నచ్చావే.. నచ్చావులే..




04. “ఏ మాయ చేసావె సినిమా” లోని పాట “నా హృదయం కరిగించి వెళ్ళకే” లోని Rap bit.


Everybody wanna know what’ feel like, a feel like,
I really wanna be here with you…
It’s not enough to say that we are made for each other,
It’s love that is Hosanna true…
Hosanna…be there when you’re calling out my name
Hosanna…feeling like me whole life has changed
I never wanna be the same…It’s time we rearrange…
I take a step You take a step,
I’m here calling out to you…
Hello…Hello……Hello…Yo…Hosanna..




05. జొలాజోలమ్మ జోల జేజెల జోల జేజెల జోల

చిత్రం : సూత్రధారులు
స్వరకల్పన : కే.వీ.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పీ శైలజ


జోలాజోలమ్మ జోల జేజెల జోల జేజెల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల నిత్యమల్లె పూల జోల
ల్లొలాలళళలల హాయి హాయే ల్లొలాలళళలల హాయి హాయే


రేపల్లె గోపన్నా రేపు మరచి నిదరోయె రేపు మరచి నిదరోయె
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరోయె ఆదమరచి నిదరోయె
ఏడు కొండల ఎంకన్నా ఎపుడనగా నిదరోయె ఎపుడనగా నిదరోయె
కోడె పిల్లడా నీకేమో కునుకైన రాదాయే కునుకైన రాదాయే
ల్లొలాలళళలల హాయి హాయే జొలజో...... పూలజొల



మీనావతారమెత్తి మేని చుట్టూ రాబోకురా
అరెరరే యాహీ యాహీ యహ్హి యహ్హి యాహీ యహ్హి
కృష్ణావతారమెత్తి కోక లెత్తుకు పోబోకురా
అయయయో యాహీ యాహీ యహ్హి హ హ హ హ
వామనావతారమెత్తి వామానావతారమెత్తి స్వామి లాగా అయిపోకు
బుద్దావతారమెత్తి బోధిచెట్టును అంటి ఉండకు

రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండి పోరా గీత నువు దిద్దిపోరా
ల్లొలాలోళ్ల హాయి హాయే

జోల జోలమ్మ జొ.........పూల జోల













06. నీ మది చల్లగా స్వామి


చిత్రం :
స్వరకల్పన :
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : పి.సుశీల



నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో


యే సిరులెందుకు యే నిధులెందుకు
యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే


చీకటి ముసిరినా వేకువ ఆగునా
యే విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో


జానకి సహనము రాముని సుగుణము
యే యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము