01. స్వాగతం ::
అయిపోయినదంతా గతం,
చెప్పబోయేదంతా స్వగతం,
చెప్పకతప్పదు మీరు నాకు...
..స్వాగతం
02. నీ పేరు ::
మది దోచే తీయనైన తలపు
పెదవిపై రాస్తే,
... నీ పేరు
03. ప్రకృతి
ప్రకృతి కొమ్మన,
అణువణువూ కమ్మన.
అందుకే అమ్మ అననా..!
04. పొగడుదాం మన తల్లి భూమి భారతిని
పొగడుదాం మన తల్లి భూమి భారతిని
నిలుపుదాం మన జాతి తేజోన్నతిని
ఎందుకాలిడినా ఏ దేశమేగినా
ఎవ్వరెదురైనా ఏ పీఠమెక్కినా
ఎన్నోదేశాల కంటెముందె వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఎట్టకేలకు అర్థరాత్రియందె ప్రసరించె కనులార అరుణ కిరణాలు
దేశ చిరుచీకట్లు ఇకనైనా తొలగిద్దాం !
స్నేహగీతాలు ఇంటింటా వెలిగిద్దాం !
ఐకమత్యంతో జాతికి రక్ష కడదాం !
అందుకై నిరంతరం దీక్ష పడదాం !
త్యాగధనులను,స్వాతంత్ర్య వీరులను స్మరించుకుందాం..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుందాం..!